
ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడౌన్‌కు వేసిన సీళ్లు, పోలీసు బందోబస్తును పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు ఉన్నారు.
భీమ్‌గల్ ఏడీఏ సరెండర్
డొంకేశ్వర్(ఆర్మూర్): భీమ్‌గల్ డివిజన్ వ్యవసాయ అధికారి (ఏడీఏ) శ్రీనివాస్ రా జును రాష్ట్ర శాఖకు సరెండర్ చేశారు. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విధులు సరిగా నిర్వర్తించడం లేదనే కారణంతో స రెండర్ చేసినట్లు తెలిసింది. కార్యాలయానికి రాకుండా విధులను నిర్లక్ష్యం చేయడంతో కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయా లని ఇటీవల ఆ శాఖ డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. కాగా, ముప్కాల్ ఏవో సాయికృష్ణకు భీమ్‌గల్ ఏడీఏగా ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు.
ఐసీడీఎస్‌లో
‘ఆకాశరామన్న’ అలజడి
● కలకలం రేపిన ఉత్తరం
● అక్రమ నియామకాలు,
ఇష్టారాజ్యంగా బదిలీలు
● పిల్లల దత్తత విషయంలో
ముడుపులపై ఆరోపణలు
● పలుమార్లు విచారణ..
చర్యలు శూన్యం
నిజామాబాద్ నాగారం: మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల శాఖ (ఐసీడీఎస్)లో ఆకాశరామన్న ఉత్తరం అలజడి సృష్టిస్తోంది. అక్రమ నియామకాలు, ఇష్టారాజ్యంగా బదిలీలు, పిల్లల దత్తత విషయంలో ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు మాయని మచ్చ తెచ్చిపెడుతున్నాయి. స్వధార్‌హోంతోపాటు ఇతర అంశాలపై పలుమార్లు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇదే శాఖలో గతంలో జరిగిన అక్రమ బదిలీలు, స్వధార్‌హోంపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు విచారణ జరిగినా ఇప్పటి వరకు నివేదికలు బయటికి రాలేదు. ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా ఆకాశరామన్న ఉత్తరం నేపథ్యంలో బుధ, గురువారాల్లో డీఎంహెచ్‌వో, డీఎండబ్ల్యూవో చాంబర్లలో అధికారులు విచారణ చేపట్టడం కలకలం రేపింది. 2011లో 1098 చైల్డ్‌హెల్ప్‌లైన్‌లో చేపట్టిన నియామకాలపై అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. పిల్లల దత్తత వ్యవహారంలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఇష్టారాజ్యంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల బదిలీలు, పదోన్నతులపై ఉద్యోగులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఐసీడీఎస్ శాఖ అక్రమాలపై గతంలోనూ విచారణ జరిగినా తగిన చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.