
అన్నదాతకు అకాల‘దెబ్బ’
అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. చేతికొచ్చిన పంట నీటిపాలయ్యింది. కోతలకు సిద్ధమైన వరిపైరు నేలకొరిగింది. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. పంటలు దెబ్బతినడంతోపాటు ధాన్యం తడిసిపోవడంతో రైతులు గుండెలుబాదుకుంటున్నారు. సంబంధిత అధికారులు నేడు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. మరో మూడు రోజులు వర్ష సూచన ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి నెట్‌వర్క్
● జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షం
● కల్లాల్లో తడిసిన ధాన్యం