
భూ భారతిపై అవగాహన అవసరం
డిచ్‌పల్లి/మోపాల్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. డిచ్‌పల్లి మండలంలోని నడిపల్లి, మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలలో శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి చట్టం ద్వారా రైతుల కు చేకూరే ప్రయోజనాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భూ సమస్య లు ఉన్న రైతులు ఏడాది కాలంలోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు. మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరి స్తారని తెలిపారు. భూభారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువు లోపు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారి, కలెక్టర్‌కు అధికారాలు కల్పించారని వివరించారు. ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తామన్నారు.
గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డులు..
గ్రామాల్లోనే రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం ప్రదర్శిస్తారని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ప్రతి గ్రామంలో గ్రామపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు మాదిరి భూమికి భూధార్ సంఖ్య కేటాయిస్తారని, దీంతో భూ ఆక్రమణలకు అవకాశం ఉండదన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయన్నారు. సదస్సులలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ తారాచంద్, డిచ్‌పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్, తహసీల్దార్లు ప్రభాకర్, రామేశ్వర్, ఏవోలు సుధామాధురి, సౌమ్య, డీటీ శ్రీకాంత్, ఆర్‌ఐలు సంతోష్, రాజేశ్వర్, సొసైటీ చైర్మన్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
‘సాదాబైనామా’కు
త్వరలో మార్గదర్శకాలు
ఆధార్ తరహాలో భూధార్ సంఖ్య
కేటాయింపు
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు