
విద్యుత్ షాక్‌తో పశువుల మృత్యువాత
సిరికొండ: మండల కేంద్రంలోని చీమన్‌పల్లి రోడ్డులో ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి విద్యుత్ షాక్‌తో ఆవు ఆదివారం మృతి చెందింది. సిరికొండకు చెందిన బొందెరి రవికి చెందిన ఆవు తన వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో మేత మేస్తోంది. అక్కడే తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆవు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు విలువ రూ. 60వేల వరకు ఉంటుందని, నష్ట పరిహరం ఇచ్చి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
పాల్దా గ్రామంలో..
నిజామాబాద్ రూరల్: మండలంలోని పాల్దా గ్రామ చెరువు శివారులో విద్యుదా ఘాతంతో మూడు పాడిగేదెలు మృతిచెందినట్లు పాడిరైతులు ఆదివారం పేర్కొన్నారు. గ్రామానికి చెందిన సంగేశ్ ప్రశాంత్, చాకలి ఆశోక్‌కు చెందిన పాడిగేదెలు ఊరు బయట చెరువు వద్దకు మేతకు వెళ్లాయి. ప్రమాదవశాత్తు కిందపడిన విద్యుత్‌వైర్ గేదెలకు తగలడంతో కరెంట్‌షాక్‌తో మృతిచెందాయి. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం అందించాలని బాధిత పాడిరైతులు కోరారు.

విద్యుత్ షాక్‌తో పశువుల మృత్యువాత