షికాగో: అరోరా/నేప్‌విల్లే నగరంలో ఫాక్స్‌వ్యాలీ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆరోసారి వైభవోపేతమైన వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా భజనలు, పూజలు, హోమాలు, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
నెమళ్లతో అల్లిన పందిరిలో కృష్ణుడు అండగా వినాయకుడిని నెమలిపై ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజించారు. ప్రతీరోజు ఇక్కడ నిర్వహించిన హారతికి వందల సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు భక్తులు స్వీకరించారు. మూడో రోజు జరిగిన గణేష్ నిమజ్జనం సందర్భంగా మహారాష్ట్ర మండల్ ఆధ్వర్యంలో ఢోల్‌తాషా నిర్వహించగా అంతా ఆనందంగా నృత్యాలు చేశారు. వినాయకుడి ఊరేగింపు కోలాహలంగా సాగింది.
అరోరా నగర మేయర్ రిచర్డ్ సీ ఇర్విన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వినాయకచవితి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సహాకరించిన ప్రతీ ఒక్కరికీ ఎఫ్‌వీజీయుఎస్ బోర్డు తరఫున అధ్యక్షుడు కొత్తకొండ విజయ ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువాహిని సాహితీ సదస్సు
Comments
Please login to add a commentAdd a comment