
భారతీయ అమెరికన్ గౌతమ్ రాఘవన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదోన్నతి కల్పించారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కొందరు భారతీయులకు ఉన్నత పదవులు లభించాయి. అందులో వైట్ హౌస్ ప్రెసిడెంట్ పర్సనల్ విభాగం డెప్యూటీ డైరెక్టర్‌గా గౌతమ్ రాఘవన్ నియమితులయ్యారు.
వైట్‌హౌస్ ప్రెసిడెంట్ పర్సనల్ విభాగం డైరెక్టర్‌గా ఉన్న క్యాథీ రస్సెల్ త్వరలో ఐక్యరాజ్య సమితిలో పని చేయబోతున్నారు. క్యాతి రస్సెల్‌ను యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరాస్. దీంతో క్యాథీ స్థానంలో వైట్‌హౌస్ ప్రెసిడెంట్ పర్సనల్ డైరెక్టర్‌గా గౌతమ్ రాఘవన్‌కి పదోన్నతి లభించింది.
Indian-origin #GautamRaghavan has been elevated to Head of the White House personnel office. pic.twitter.com/nLL5jIZv7u
— All India Radio News (@airnewsalerts) December 11, 2021
గౌతమ్ రాఘవన్ ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. వెస్ట్ వింగర్స్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా పని చేశారు. ఆయకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment