పెదకాకాని శివారులో హైవేపై చెల్లా చెదురుగా పడిపోయిన ప్రయాణికులు
పెదకాకాని: జాతీయ రహదారిపై ఆటోను వెనుక నుంచి కారు ఢీ కొన్న సంఘటన పెదకాకాని శివార్లలో చోటు చేసుకుంది. గుంటూరు నుంచి అప్పీ ఆటో శుక్రవారం ఆరుగురు ప్రయాణికులతో బయలు దేరింది. పెదకాకాని శివారులోని అరబిక్ స్కూల్ సమీపంలోకి చేరుకునే సరికి వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ప్రయాణికులు చెల్లా చెదురుగా పడ్డారు. ఈ ప్రమాదంలో గుంటూరు ఆనందపేటకు చెందిన షేక్ నూర్‌బీబీ(46) మృతి చెందింది. ఘటనా స్థలానికి పెదకాకాని పోలీసులు చేరుకుని క్షతగాత్రులను 108లో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా క్రమబద్ధీకరించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమార్తె షేక్ మస్తాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. కుమార్తెను ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తీసుకెళ్తూ రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలై తల్లి నూర్‌బీబీ కనిపించ లోకాలకు చేరింది.
ఆటోను ఢీ కొన్న కారు మరో ముగ్గురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment