సీనియర్ సిటిజన్ రాయితీలపై ప్రచారం అసత్యం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ీసనియర్ సిటిజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీని రైల్వేశాఖ పునరుద్ధరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో ప్రకటించారు. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. గతంలో రైల్వేశాఖ సీనియర్ సిటిజన్‌లకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ ఇచ్చేదని, 2020 మార్చి నుంచి కరోనా సమయంలో ఈ రాయితీని తొలగించిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి రాయితీని పునరుద్ధరించలేదని స్పష్టంచేశారు. కొన్ని సోషల్ మీడియాల్లో మాత్రం రాయితీపై తప్పుడు ప్రచారం జోరుగా సాగడంతో సీనియర్ సిటిజన్లలో కొంత అయోమయం నెలకొందని వివరించారు. కచ్చితమైన సమాచారం కోసం భారతీయ రైల్వే వెబ్‌సైట్‌లు లేదా అధీకృత మీడియాల్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రయాణికులు పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు.
రైల్వే ప్రయాణికులను గాయపరిచి చోరీచేసే నిందితుల అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ ఔటర్‌లో కదులుతున్న రైలులో ఫుట్‌బోర్డుపై ఉండే ప్రయాణికులను కిందకు లాగి, వారిపై బ్లేడుతో దాడి చేసి నగదు, సెల్ ఫోన్‌లు చోరీ చేసే ఇద్దరు నిందితులను ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకు, మరో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ జి.వి.రమణ కథనం మేరకు.. ఈ నెల రెండో తేదీన శ్రీనివాసరావు అనే వ్యక్తి తెనాలి నుంచి విజయవాడకు రైలులో బయలుదేరాడు. ఆ రైలు బస్‌స్టేషన్, పూలమార్కెట్ సమీపంలోకి రాగానే కొంత మంది బ్లేడ్ బ్యాచ్ సభ్యులు అతడిని కిందకి లాగి బ్లేడుతో గాయపర్చి పర్సు, సెల్‌ఫోన్ చోరీ చేశారు. మరుసటి రోజు కూడా ఇదే తరహాలో పవన్ కుమార్‌ను బ్లేడుతో గాయపర్చి అతని వద్ద సెల్‌ఫోన్ దోచుకున్నారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఆదేశాలతో జీఆర్‌పీ డీఎస్పీ రత్నరాజు పర్యవేక్షణలో సీఐ జి.వి.రమణ ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడిన వారిలోని ఒక మైనర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా మరో ముగ్గురు యువకులతో కలసి బ్లేడుతో దాడి చేసి చోరీలకు పాల్పడినట్లు తెలిపాడు. మైనర్ ఇచ్చిన సమాచారం మేరకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కన్నీటి రాజేష్‌ను అదుపులోకి తీసుకుని చోరీ చేసిన సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.
107 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఎటువంటి బిల్లులు, పత్రాలు లేకుండా రైలులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలకు పైగా విలువైన 107 కిలోల వెండి ఆభరణాలను విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ జి.వి.రమణ కథనం మేరకు.. మంగళవారం రాత్రి పోలీసులు విజయవాడ స్టేషన్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు. జీటీ ఎక్స్‌ప్రెస్‌లో ఆగ్రా నుంచి వచ్చి విజయవాడలో దిగిన సందీప్ వద్ద బ్యాగులను సోదా చేశారు. వాటిలో 107 కిలోల వెండి ఆభరణాలు కనిపించాయి. బిల్లులు లేకుండా నగరంలోని ఒక జ్యూయలరీ షాపు యజ మాని రాహుల్‌కు ఇవ్వడానికి వెండి ఆభరణాలను తీసుకొచ్చినట్లు సందీప్ తెలిపాడు. సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు ఆ ఆభరణాలను జీఎస్‌టీ అధికారులకు అప్పగించారు.
సీనియర్ సిటిజన్ రాయితీలపై ప్రచారం అసత్యం
Comments
Please login to add a commentAdd a comment