చందర్లపాడు(నందిగామ రూరల్): మూడు గ్రామాల్లో ఆరు ఇళ్లలో పట్టపగలు చోరీ జరిగింది. చందర్లపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో శనివారం మధ్యాహ్న సమయంలో తాళాలు వేసి పొలం పనులకు వెళ్లిన మూడు ఇళ్లలో చోరీ జరిగింది. మారెం హరికృష్ణ నివాసంలో 12 గ్రాముల బంగారం, రూ.36 వేల నగదు, మారెం చిన్న నరసింహారావు ఇంట్లో రూ.80 వేల నగదు, దర్శి జయమ్మ ఇంట్లో 10 గ్రాముల బంగారం, రూ.60 వేల నగదు చోరీకి గురైంది. మూడు ఇళ్లలో ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాల్లో ఉన్న రూ.1.76 లక్షల నగదు, 22 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం. మండలంలోని కాండ్రపాడులో చిన్న వెంకటరెడ్డి నివాసంలో బీరువా పగలగొట్టి రూ.12 లక్షల విలువ చేసే బంగారు నగలు, రూ.15 వేలు నగదు చోరీకి గురవగా మహేశ్వరరెడ్డి ఇంటిలో బీరువాను పగలగొట్టి రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించినట్లు బాధితులు పేర్కొంటున్నారు. నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో కనిశెట్టి గాంధీ ఇంటి, బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలోని 42 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40వేలు నగదు చోరీకి గురైందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ వైవీఎల్ నాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment