
ఆయనొస్తే అన్నీ బందే!
ఉయ్యూరు రూరల్: ఆయన వస్తే అన్ని బంద్ చేయాలి... వచ్చే రహదారిలో గుంతలు లేకుండా సక్రమంగా యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయాలి.. ఇది ఉయ్యూరులో ఆదివారం సీఎం చంద్రబాబు రాకతో అధికారులు, పోలీసు యంత్రాంగం హడావుడిగా విధులు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె నిశ్చితార్థ మహోత్సవానికి అతిథిగా సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులతో కలిసి ఉయ్యూరు విచ్చేశారు. ఈ క్రమంలో ఆయన వచ్చే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు యుద్ధప్రాతిపదికన స్పీడ్ బ్రేకర్లు తొలగించి గుంతలను పూడ్చి చేతులు దులుపుతున్నారు. దీనికి తోడు పోలీసు అధికారులు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని నెపంతో ముందస్తు చర్యలో భాగంగా ఆ రహదారి వెంట ఉన్న చిన్న, చిన్న షాపులను, టీ స్టాళ్లను మూయించేశారు. దీంతో పలువురు చిరు వ్యాపారులు. రోజువారీలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఆయన వస్తే అన్ని బందే అనే రీతిలో అధికార యంత్రాంగం విధులు నిర్వహించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.
రహదారికి నూతన హంగులు

ఆయనొస్తే అన్నీ బందే!
Comments
Please login to add a commentAdd a comment