
ఖాతాదారుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ఎస్‌బీఐ నార్త్ జోన్ రీజనల్ మేనేజర్ రాఘవరావు
కంకిపాడు: బ్యాంకు ఖాతాదారుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ నార్త్ జోన్ రీజనల్ మేనేజర్ ఆర్.రాఘవరావు అన్నారు. రీజనల్ కార్యాలయ ఆదేశాలతో ఎస్‌బీఐ కంకిపాడు బ్రాంచ్ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం మెగా గృహ రుణ మేళా నిర్వహించారు. 100 మంది ఖాతాదారులు గృహ రుణ మేళాకు హాజరై వివరాలు తెలుసుకున్నారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఖాతాదారులు తమ ఆస్తులు, వ్యాపారాల వివరాలతో కూడిన డాక్యుమెంట్లను సమర్పించారు. ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామన్నారు. సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని కోరారు. బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఏవీవీఎస్ ప్రకాష్‌రావు పర్యవేక్షణలో నిర్వహించిన రుణమేళాలో ఫీల్డ్ ఆఫీసర్ ఎన్.సంధ్యారాణి, క్యాష్ ఆఫీసర్ ప్రసాదరావు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment