ముగిసిన ఎడ్ల పూటీ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని దాములూరు కూడలి సంగమేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలో కల్యాణోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఎడ్ల పూటీ లాగుడు పోటీలు శనివారం అర్ధరాత్రితో ముగిశాయి. సీనియర్ విభాగంలో జరిగిన పూటీ లాగుడు పోటీలకు 14 జతల ఎడ్లు పాల్గొన్నట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. ఎనిమిది నిమిషాల వ్యవధి, ఆరుగురు వ్యక్తులతో రెండు క్వింటాళ్ల దూరాన్ని లాగేందుకు ఎడ్ల జతలు పోటీ పడ్డాయి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పగడంవారిపాలెంకు చెందిన కేవీ రెడ్డి ఎడ్ల జత ఎనిమిది నిమిషాల వ్యవధిలో 3,110 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలవగా.. బాపట్ల జిల్లా వేటపాలేంకు చెందిన మునగయ్య ఎడ్ల జత 2,727 అడుగులు, బాపట్ల జిల్లా ముత్తాయపాలెంకు చెందిన వెంకట మణికంఠ ఎడ్ల జత 2,659 అడుగులు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరుకు చెందిన షేక్ హజ ఎడ్ల జత 2,458 అడుగులు, బాపట్ల జిల్లా ఆవులదొండివారిపాలెంకు చెందిన గోగినేని కార్తీక్ ఎడ్ల జత 2,447 అడుగులు లాగి వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ. 30 వేలు, 25వేలు, 20వేలు, 15 వేలు, 10 వేలను బహుమతిగా అందజేశారు. సీఐ వైవీఎల్ నాయు డు, సర్పంచ్ గాదెల వెంకట రామారావు, రైతు కమిటీ సభ్యులు గింజుపల్లి శ్రీనివాసరావు, చెరుకూరు సాంబశివరావు, వట్టికొండ చంద్రమోహన్, తులసీరావు, సిద్ధార్థ వీరబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment