జలవనరుల శాఖ ఉద్యోగి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

జలవనరుల శాఖ ఉద్యోగి బలవన్మరణం

Published Thu, Mar 6 2025 3:16 AM | Last Updated on Thu, Mar 6 2025 3:16 AM

జలవనరుల శాఖ ఉద్యోగి బలవన్మరణం

జలవనరుల శాఖ ఉద్యోగి బలవన్మరణం

రామవరప్పాడు: జలవనరుల శాఖ ఉద్యోగి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరు రామానగర్‌లో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నిడమానూరు రామానగర్‌లో కన్నేటి వినోద్‌, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తు న్నారు. ఆయన జలవనరుల శాఖలో నది పరిరక్షణ విభాగం అసిస్టెంట్‌ పనిచేస్తున్నారు. రొయ్యూరు నుంచి ఘంటసాల మండలం పాపావినాశం వరకు ఉన్న కృష్ణానది ఆయన పరిధిలో ఉంది. వినోద్‌ మద్యానికి బానిసై తరుచూ ఇంట్లో గొడవ పడేవాడు. విధులకు సైతం గైర్హాజరయ్యేవారు. గతంలో విధులకు హాజరుకావాలని ఉన్నతాధికారులు ఫోన్‌ చేస్తే తాను చనిపోతున్నానని బెదిరిస్తూ వాట్సాప్‌లో పురుగు మందు డబ్బా పంపించారు. ఈ క్రమంలో బుధవారం కూడా తన చావుకు తమ శాఖలో కొందరు అధికారులు కారణమంటూ సూసైడ్‌ నోట్‌ రాసి పురుగుల మందు తాగారు. అపస్మారకస్థితిలో ఉన్న వినోద్‌ను కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సూసైడ్‌ నోట్‌లో అధికారుల పేర్లు

తన బలవన్మరణానికి జలవనరుల శాఖ జేఈ శ్రీరామ జనార్దన్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.కిరణ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సుజాత, తన అత్త కనకదుర్గ కారణమంటూ వినోద్‌ సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌ నోట్‌లో ప్రస్తావించిన అధికారులు తరుచూ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వినోద్‌ తమతో చెప్పేవారని అతని సన్నిహితులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో రుణానికి దరఖాస్తు చేసు కుంటే అడ్డుపడ్డారని, మచిలీపట్నం సమీపంలోని శ్రీకాకుళానికి పెట్టుకున్న బదిలీని కూడా అడ్డుకుని వేధిస్తున్నారని వినోద్‌ చెప్పవారని వివరించారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో మనస్తాపానికి గురైన వినోద్‌ ఆదే శాఖలో పనిచేసే మరో ఉద్యోగికి ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకునేలా చూడాలని చివరగా మాట్లాడినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement