
ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఆటల పోటీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే మహిళా ఉద్యోగులు ఆటల పోటీల్లో పాల్గొని సందడి చేశారు. ఉత్సా హంగా, ఉల్లాసంగా ఆటలు ఆడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మహిళా ఉద్యోగులకు నిర్వహిస్తున్న ఆటల పోటీలు బుధవారం కొనసాగాయి. ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్ పర్సన్ పారె లక్ష్మి, కార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి, జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్‌రావు ఈ ఆటల పోటీలను ప్రారంభించారు. అమరావతి జేఏసీ సభ్య సంఘాలకు చెందిన మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొన్నారు. లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, కప్ – బెలూన్, షటిల్, చెస్, క్యారమ్స్, బాల్ గేమ్ వంటి పోటీలు ఉత్సాహంగా సాగాయి. గురువారం కూడా వివిధ క్రీడాంశాలలో పోటీలు జరుగుతాయని చైర్ పర్సన్ లక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment