చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మంచంపై ఉన్న ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడీపేటలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. లంబాడీపేట అడ్డరోడ్డులో షేక్ బాజీ(55) తన తల్లి అమ్మాజీతో కలిసి నివసిస్తున్నాడు. బాజీ భార్య కొన్నేళ్ల కిందట మృతి చెందగా, ఇద్దరు కుమార్తెలకు వివాహాలయ్యాయి. నాలుగేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాజీ అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. అప్పటి నుంచి తల్లి అమ్మాజీనే అతడి బాగోగులు చూసుకుంటోంది. బుధవారం సాయంత్రం బాజీ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత తల్లి అతనిని మంచంపై పడుకోబెట్టి బయటకు వెళ్లింది. ఇంతలో ఇంటి లోపల నుంచి పొగలు రావడంతో స్థానికులు కంగారుగా వచ్చి చూసే సరికి బాజీ పడుకున్న మంచం మంటల్లో చిక్కుకుంది. స్థానికులు ఇంటి ఆవరణలో ఉన్న నీటితో మంటలను అదుపు చేశారు. అప్పటికే బాజీ పూర్తిగా కాలిపోయి కనిపించాడు. ఘటనపై పోలీ సులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మంటలు ఎలా వ్యాపించాయనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment