దేశమంతా ఒకేసారి ఎన్నికలతో అభివృద్ధి
●కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ ●స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో వన్ నేషన్–వన్ ఎలక్షన్‌పై సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానంలో దేశమంతటా అన్ని రకాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత మురళీధరన్ అన్నారు. జమిలి ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలు దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంశంపై గురువారం జరిగిన సెమినార్‌లో మురళీ ధరన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించాల్సి రావడంతో ఎన్నికల కోడ్ పేరుతో సుమారు మూడు నెలల వరకు ఎలాంటి నిర్ణయాలు, పథకాలు, అభి వృద్ధి పనులు చేపట్టడానికి వీలులేని పరిస్థితులు దేశాభివృద్ధికి అటంకం కలిగిస్తు న్నాయని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు ఆ తరువాత స్థానిక సంస్థలు ఇలా ఒకదాని తరువాత ఒక ఎన్నికలు జరుగుతూ రాష్ట్ర అభివృద్ధికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. పాఠశాలలో పోలింగ్ బూత్‌లు ఉండటం కారణంగా ఎన్నికల సమయంలో రెండు, మూడు రోజులైనా పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి ఉందని, అధికారులకు ఎన్నికల డ్యూటీలతో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. తరుచూ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగటం వల్ల ఖర్చుతో పాటు సమయం వృథా అవుతోందని, అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానం
వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌తో దేశం అభి వృద్ధి చెందుతుందని కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో దేశం ముందుకు వెళ్తోందని, ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో దేశం ఉందని తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేసి పూర్తి స్థాయి విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్న లకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. సెమినార్ అనంతరం మీడియా ప్రతినిధుల అడి గిన పలు ప్రశ్నలకు మురుళీధరన్ జవాబిస్తూ, వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అన్న అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతోందన్నారు. 2023 నవంబర్‌లో తెచ్చిన చట్టం ప్రకారం పార్లమెంటు, అసెంబ్లీల్లో నియోజకవర్గాల విభజనపై చర్చ జరగా లన్నారు. 2029 ముందే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment