సచివాలయ ఉద్యోగుల పంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అర్లయ్య
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, సామాజికాభివృద్ధి, సంతృప్తికర స్థాయిలను తెలుసుకు నేందుకు వినియోగిస్తున్న ఆధార్ ప్రామాణికత విధానాన్ని మార్చాలని గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగుల పంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య గురువారం ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వరుస సర్వేల నిమిత్తం సచివాలయ ఉద్యోగులను ప్రజల ఇళ్లకు పంపి ఆధార్ అథెంటిఫికేషన్ కోసం ఓటీపీ లేదా బయోమెట్రిక్, ఫేషియల్ కోసం అడిగినప్పుడు పదే పదే ఎందుకు ఇన్ని సార్లు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారని తెలి పారు. ఒక వైపు ఓటీపీలు షేర్ చేయవద్దని వివిధ మాధ్య మాల్లో బ్యాంకులు చెబుతున్నాయని పేర్కొ న్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి ఓటీపీలు అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయించే ప్రతి సర్వే గురించి ప్రభుత్వం ముందుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మాధ్యమాల ద్వారా ప్రతి పౌరుడికి తెలిసేలా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పుడే ఫలితం ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment