ఎవర్‌గ్రీన్ సైకిల్
● విజయవాడలో సైక్లింగ్‌కు సై అంటున్న యువత ● ఫిట్‌నెస్ కోసం కొందరు.. స్టైల్ కోసం మరికొందరు
● ఖరీదైన మోడళ్లపై మోజు ● విదేశీ సైకిళ్లకు డిమాండ్ ● ఆరోగ్యదాయకమే అంటున్న నిపుణులు
ప్రతిరోజూ సైకిల్ తొక్కుతా..
ప్రతిరోజూ 20 నుంచి 25 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతా. దీని వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటాం. ఎనిమిదేళ్ల కిందట సైకిల్ తొక్కడం ప్రారంభించా. తొలుత ఐదారు కిలో మీటర్లు తొక్కేవాడిని, ఇప్పుడు ఉదయాన్నే 25 కి.మీల వరకూ తొక్కడం ప్రారంభించా. నగరంలో తీవ్ర ట్రాఫిక్‌తో సైకిల్ తొక్కేందుకు అనువైన రోడ్లు లేవు. సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– చలపాక కిరణ్‌కుమార్, వ్యాపారి
సైకిల్ ఇష్టంగా వాడతా..
నా చిన్నప్పటి నుంచి సైకిల్‌ను ఇష్టంగా వాడతా. ఇప్పటికీ బాస్కెట్‌బాల్ ఆడేందుకు స్టేడియానికి సైకిల్ పైనే వెళ్తుంటా. నాకు ఇష్టమైన సైకిల్‌ను కొనుగోలు చేశా. వైద్య కళాశాలకు వెళ్లి వస్తూనే ప్రతిరోజూ కొద్ది సమయం సైకిల్‌కు కేటాయిస్తా. సెలవు రోజుల్లో దానిపైనే బయటకు వెళ్తుంటా. మా అమ్మా, నాన్న ఇద్దరూ వైద్యులే. ఖరీదైన బైక్ కంటే నాకు సైకిల్ అంటేనే ఇష్టం. నచ్చిన మోడల్‌ను రూ.40 వేలు పెట్టి కొన్నా.
– అక్రమ్ షరీఫ్, వైద్య విద్యార్థి
గుడ్ మార్నింగ్.. ఇదొక్క అందమైన మార్నింగ్.. అంటూ సూర్యోదయానికి ముందే ట్రింగ్ ట్రింగ్ మనే సైకిల్ బెల్.. కాసేపైన తర్వాత అదే శబ్దం మరోసారి.. ఇది పాలవాడి సైరన్.. మరికాసేపైన తర్వాత అదే సైకిల్ బెల్.. ఇది మన ఇంట్లోని పిల్లలు స్కూల్‌కి బయలుదేరిన శబ్దం.. ఇలా మనిషి జీవన గమనంలో సైకిల్ అనేది అతి ప్రాముఖ్యమైన, నిత్యావసరమైన సాధనంగా ఉండేది. ముఖ్యంగా సామాన్యుడి వాహనంగా పేరుగడించింది. కాల క్రమంలో మోటారు వాహనాల రాకతో సైకిల్ వన్నె తగ్గినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు అదే సైకిల్ శ్రీమంతుడి వాహనంగా రూపాంతరం చెందింది. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడవడమో, సైకిల్ తొక్కడమో చేయాల్సిందేనని డాక్టర్లు చెబుతుంటే మళ్లీ ఫ్లాష్ బ్యాక్ ‘చక్రాల్లోకి’ వెళ్లక తప్పడం లేదు. యువత కూడా ఖరీదైన సైకిల్‌ను తొక్కడం ఫ్యాషన్‌గా భావిస్తోంది. సైకిల్ కూడా కాలానుగుణంగా తన రూపురేఖలు మార్చుకొని తాను
‘ఎవర్‌గ్రీన్’ అని చాటిచెబుతోంది.
– లబ్బీపేట(విజయవాడతూర్పు)
ఎవర్‌గ్రీన్ సైకిల్
Comments
Please login to add a commentAdd a comment