గీత కులాలకు మద్యం షాపుల కేటాయింపు
11 షాపులకు 335 దరఖాస్తులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా కల్లు గీత కులాలకు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ గురువారం జరిగింది. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి పరిధిలో గల బీసీ సంక్షేమ భవన్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధ్యక్షత వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా 335 దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం కటెక్టర్ లక్ష్మీశ లాటరీ ప్రక్రియ ద్వారా దుకాణాలను కేటాయించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 71 దరఖాస్తులు వచ్చాయి. అలాగే జగ్గయ్యపేట నుంచి 21, కొండపల్లి మునిసిపాలిటీ నుంచి 47, వీరులపాడు 17, వత్సవాయి 31, తిరువూరు 20, ఎ.కొండూరు 31, నందిగామ 31, రెడ్డిగూడెం 18, విస్సన్నపేట 16 (శెట్టిబలిజ), జగ్గయ్యపేట రూరల్ నుంచి 22 వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు ఒక్కరే నాలుగైదు దరఖాస్తులు చేశారు. ఒక్కో దుకాణానికిగాను మూడు నంబర్లు చొప్పున లాటరీ తీయగా వాటిల్లో మొదటి వ్యక్తిని విజేతగా ప్రకటించారు. రిజర్వ్–1, రిజర్వ్–2గా మరో రెండు నంబర్లను తీశారు. మొదట ప్రకటించిన వ్యక్తికి మరో దుకాణం దక్కి దాని వైపు వెళ్తే వెంటనే రిజర్వ్–1కి కేటాయిస్తారు. అతను ముందుకు రాని పక్షంలో రిజర్వ్–2కు కేటాయిస్తారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ ఎస్. శ్రీనివాసరావు, అసిస్టెంట్ డీపీఈఓ రామశివ, భవానీపురం ఎకై ్సజ్ స్టేషన్ సీఐ పి. గోపాలకృష్ణ పాల్గొన్నారు.
ప్రభుత్వానికి రూ.6.70 కోట్ల ఆదాయం
ఒక మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేయాలంటే రూ.2లక్షలు ముందస్తుగా చెల్లించాల్సి ఉంది (నాన్ రిఫండబుల్). ఆ విధంగా 335 దరఖాస్తుల ద్వారా రూ.6.70 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇది కాకుండా ఒక్కో దుకాణం లైసెన్స్ ఫీజు నిమిత్తం రూ.30లక్షలు చెల్లించాలి. లాటరీ ద్వారా ఎన్నికై న వ్యక్తి నిర్ణయించిన ఫీజు మొత్తంలో వెంటనే 1/4 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment