పెనమలూరు: కానూరులో భార్యపై సుత్తితో దాడి చేసి గాయపర్చటంతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం కానూరు మన కల్యాణ మండపం ప్రాంతంలో ఉన్న సౌమీ అపార్టుమెంట్‌లో పి.లక్ష్మి, భర్త తలుపులు ఇద్దరు పిల్లలతో కలసి ఉంటున్నారు. భర్త అపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తుండగా భార్య అపార్టుమెంట్ ఇళ్లల్లో పని చేస్తుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తలుపులు ఆమె ఇంట్లో నిద్రపోతున్న సమయంలో సుత్తితో తలపై కొట్టాడు. భార్య బిగ్గరగా కేకలు వేయగా అపార్టుమెంట్‌లో ఉన్న వారు ఆమెను కాపాడారు. గాయపడిన లక్ష్మిని కానూరులో ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు భర్తపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment