
పాఠశాల విద్యార్థినులకు ఆత్మరక్షణలో శిక్షణ
విజయవాడస్పోర్ట్స్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆత్మరక్షణలో శిక్షణను ప్రారంభించినట్లు రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ ఎన్.లక్ష్మీసామ్రాజ్యం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని 314 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడ నగరం దుర్గాపురంలోని ఎస్‌టీవీఆర్ మునిసిపల్ హైస్కూల్‌లో ఈ శిక్షణను సోమవారం ప్రారంభించారు.
జిల్లా కో ఆర్డినేటర్‌లు ఎం.అంకమరావు, పి.గౌరీశంకర్ పర్యవేక్షణలో విద్యార్థినులకు తైక్వాండోలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సమగ్ర శిక్ష జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఒక్కో పాఠశాలలోని విద్యార్థినులకు 20 గంటల పాటు శిక్షణను ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment