కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
గుడ్లవల్లేరు: కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడికి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అంగలూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. గుడ్లవల్లేరు ఎస్.ఐ ఎన్.వి.వి.సత్యనారాయణ చెప్పిన వివరాల మేరకు మండలంలో అంగలూరు గ్రామ శివారులో సోమవారం ఉదయం రోడ్డు పక్కన స్కూటీపై పెడనకు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు(45) వెళ్తున్నాడు. ఆ స్కూటీని మచిలీపట్నం నుంచి గుడివాడ వైపు ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తలకు బలమైన గాయమైంది. కాలు, చేతులకు కూడా గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి డ్రైవర్‌తో పాటు కారును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.
కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment