అంగన్‌వాడీలకు ‘నిర్బంధ శిక్ష’ణ
ఉయ్యూరు రూరల్: అంగన్‌వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ‘చలో విజయవాడ‘ పేరిట ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు విశ్వప్రయ త్నాలు చేశారు. చివరకు పెద ఓగిరాల ఎంపీపీ పాఠశాలలో శిక్షణ, రివ్యూ సమావేశం నిర్వహించి మమ అనిపించారు. చలో విజయవా డకు అంగన్‌వాడీ కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కృష్ణాజిల్లా కంకిపాడు ప్రాజెక్ట్ అధికారులు స్వామి భక్తిని చాటుకునేలా ఈ సమావేశం నిర్వహించారని ట్రేడ్ యూనియన్ నాయకులు బి.రాజేష్ విమర్శించారు. కంకిపాడు ప్రాజెక్టు పరిధిలో ఎనిమిది సెక్టర్లు ఉండగా, ఆకునూరు సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీలకు మాత్రమే సమావేశం నిర్వహించి ధర్నాకు వెళ్లకుండా అధికారం ముసుగులో అడ్డు కున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ప్రతినెలా చివరిలో సమావేశం నిర్వహించి రిపోర్టులు సేకరించి సమీక్షలు చేయాల్సిన ఐసీడీఎస్ అధికారులు అందుకు విరు ద్ధంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శిక్షణ, రివ్యూ పేరుతో అడ్డుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సోమవారం ఉయ్యూరు మండలం ఆకునూరు సెక్టర్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించామని కంకిపాడు ప్రాజెక్టు సీడీపీఓ బేబీ సుకన్య తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి నెలవారీ రిపోర్టులు సేకరించామని పేర్కొన్నారు.
ప్రాజెక్టులో ఒక్క సెక్టారులోనే మీటింగ్
Comments
Please login to add a commentAdd a comment