విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహరి
(బుధ) (గురు)
విజయవాడ 6.22 4.59
మచిలీపట్నం 6.21 4.58
విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ
లబ్బీపేట: గుణదలలోని మడోన డెఫ్ అండ్ డంబ్ పాఠశాల విద్యార్థులకు మంగళవారం కోవే స్వచ్ఛంద సంస్థ, గ్రోవెల్ సహకారంతో ట్యాబ్‌లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అందజేశారు.
ముగిసిన స్కౌట్ శిబిరం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): స్కౌట్ విద్యార్థులకు విజయవాడ పటమటలోని జెడ్పీ హైస్కూల్‌లో రాష్ట్ర స్థాయి రాజ్య పురస్కార్ పరీక్ష శిబిరం మంగళవారం ముగిసింది.
దుర్గమ్మ సేవలో కేంద్ర బృందం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర అధికారుల బృందం మంగళవారం దర్శించుకుంది. క్యాబినెట్ సెక్రటేరియట్ సెక్రటరీ వందన గుర్నాని, డెప్యూటీ సెక్రటరీ శ్వేత మొహంతి, డీపీఐఐటీ డెప్యూటీ సెక్రటరీ యశ్వసి ముండ్, నీతి అయోగ్ గాయత్రి పాండే అమ్మవారిని దర్శించుకున్నారు.
రోగులకు నాణ్యమైన
వైద్యం అందించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, యూపీహెచ్‌సీలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అంతే కాకుండా మైలవరం–2 సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్‌ను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రోగులు, రక్తపరీక్షలు నిర్వహిస్తున్న తీరు, మందుల అందుబాటు వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం అదే గ్రామంలో జరుగుతున్న ఎన్‌సీడీ–సీడీ సర్వేను ప్రత్యక్షంగా వీక్షించారు. చంద్రాల వైద్యాధికారి డాక్టర్ ఉనీత్ పాల్గొన్నారు.
ఏపీకి చేరుకున్న మయన్మార్‌లో చిక్కుకుపోయిన వ్యక్తులు
గన్నవరం: Ð]l$Ķæ$-¯éÃÆŠ‡ §ólÔèæ…ÌZ _MýS$P-MýS$-´ù-Ƈ$$¯]l B…{«§ýl-{ç³-§ól-ÔŒæMýS$ ^ðl…¨¯]l Hyýl$-VýS$Æý‡$ Ð]lÅMýS$¢Ë$ ¿êÆý‡™èl {糿¶æ$™èlÓ ^öÆý‡Ð]l™ø Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… çÜ$Æý‡-„ìS-™èl…V> VýS¯]l²-Ð]lÆý‡… ÑÐ]l*-¯é-{Ôèæ-Ķæ*-°MìS ^ólÆý‡$-MýS$-¯é²Æý‡$. VýS$…r*Æý‡$ hÌêÏMýS$ ^ðl…¨¯]l Ð]l¬VýS$YÆý‡$, }M>-MýS$-âýæ…, Æ>f-Ð]l$…{yìl, Ñf-Ķæ$-Ðéyýl, {´÷§ýl$ª-r*-Æý‡$MýS$ ^ðl…¨¯]l Ð]l$Æø ¯]lË$-VýS$Æý‡$ ÑÑ«§ýl Hgñæ-±ÞË$ §éÓÆ> Ð]lÆŠ‡P ÒÝëOò³ E§øÅ-V>Ë$ °Ñ$™èl¢… Ð]l$Ķæ$-¯éÃÆŠ‡ ÐðlâêÏÆý‡$. Ð]lÇP…VŠæ ÒÝëÌS VýSyýl$Ð]l# ¡Ç-¯]l-ç³µsìæMîS Ððl¯]lMìSP Æ>MýS$…yé Ð]l$Ķæ$¯éÃ-ÆŠ‡-ÌZ¯ól íܦÆý‡-ç³yìl-´ù-Ķæ*Æý‡$. D ÑçÙ-Ķæ*°² VýS$Ç¢…-_¯]l A«¨-M>-Æý‡$Ë$ Hyýl$-VýS$రి ´ë‹Ü-´ù-ÆŠ‡tË$, ÒÝë-ÌS¯]l$ ÝëÓ«©¯]l… ^ólçÜ$MýS$° ¿êÆý‡™èl {糿¶æ$™èlÓ A«¨-M>-Æý‡$-ÌSMýS$ çÜÐ]l*-^éÆý‡… C^éaÆý‡$. çܵ…¨…-_¯]l MóS…{§ýl… Ð]l$Ķæ$-¯éÃÆŠ‡ A«¨-M>-Æý‡$-ÌS™ø çÜ…{ç³-¨…-ç³#Ë$ fÇí³ Hyýl$-VýS$-Ç° ¯]l*ÅÉìl-ÎÏMìS ¡çÜ$-MýS$-Ð]l-^éaÆý‡$. AMýSPyýl çÜÐ]l${VýS Ñ^é-Æý‡×æ A¯]l…-™èlÆý‡… Ð]l$…VýS-âýæÐéÆý‡… Æ>{† GƇ$$Ç…-yìlĶæ* ÑÐ]l*-¯]l…ÌZ VýS¯]l²-Ð]lÆý‡… ç³…í³…-^éÆý‡$. CMýSPyýl GƇ$$ÆŠ‡-´ù-ÆŠ‡tÌZ ÒÇ° VýS¯]l²Ð]lÆý‡… ïÜI ½Ò. ÕÐ]l-{ç³-Ý맊æ, G‹ÜI }«§ýl-ÆŠ‡Ë$ ÇïÜÐŒæ ^ólçÜ$-MýS$-¯é²Æý‡$. A¯]l…-™èlÆý‡… Hyýl$-VýS$-ÇÌZ I§ýl$-VýS$-Ç° ÐéÇ MýS$r$…º çÜ¿¶æ$Å-ÌSMýS$ Aç³µ-W…-^éÆý‡$. Æ>fÐ]l$…{yìl, {´÷§ýl$ªr*Æý‡$MýS$ ^ðl…¨¯]l Ð]lÅMýS$¢Ë¯]l$ º$«§ýlÐéÆý‡… Aç³µW…^èl¯]l$¯]l²r$Ï ïÜI ™ðlÍ´ëÆý‡$.
కపట ‘కూటమి’ నాటకాలు ఇంకెన్నాళ్లు?
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలకు నిధులు విడుదల చేయకపోవటంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ప్రతి విద్యార్థికి విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో గత ప్రభుత్వం అండగా నిలచింది. వారి చదువుకు చెల్లించాల్సిన ఫీజులను ఎప్పటికప్పుడు వారి తల్లుల ఖాతాల్లో వేసి వారి చదువులకు భరోసా కల్పించింది. కానీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా పథకాలకు నిధులు మంజూరు చేయలేదు. దాంతో ఫీజులు చెల్లించలేకపోవటంతో ఆయా కళాశాలలు ఆ విద్యార్థుల సర్టిఫికెట్లను తమ వద్దనే ఉంచుకుంటున్నాయి.
ఉద్యోగాలు లేవు.. పరిశ్రమలు రావు..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏటా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల ద్వారా ఏటా 20 వేల మంది పట్టభద్రులు బయటకు వస్తున్నారు. అలాగే డిగ్రీ, పీజీలు చేసిన మరో 25 వేల మంది విద్యార్థులు పట్టాలు చేతపట్టి రోడ్లపైకి వస్తున్నారు. పాలిటెక్నిక్, బీఈడీ వంటి ఇతర కోర్సులను పూర్తి చేసిన యువత తమ అర్హత పత్రాలతో బయటకు చేరుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో ప్లేస్‌మెంట్ల ద్వారా కేవలం పది నుంచి 20 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నా.. అవి అక్కరకు రావటం లేదు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగ అవకాశాలు పూర్తిగా కానరాకుండా పోవటంతో జిల్లాలోని యువకులు ఏదైనా చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని జీవించాలని భావిస్తున్నారు. కానీ ఎంఎస్‌ఎంఈలను ప్రొత్సాహించాల్సిన ప్రభుత్వం వాటిని సైతం యువతకు అందించేందుకు ఏమాత్రం చర్యలు చేపట్టడంలేదు. అంతేకాక చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారాలు పూర్తిగా దిగజారాయి. ఏ నెలకానెల జీఎస్టీ ఆదాయం తగ్గుతుండటం వ్యాపారాల దుస్థితిని తెలియజేస్తుంది. తద్వారా ప్రైవేటు ఉద్యోగాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.
డీఎస్సీ కోసం ఎదురు చూపులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ ప్రకటిస్తామంటూ, సంతకాలు చేశామంటూ హడావుడి చేసింది. కానీ ఇప్పటి వరకూ పోస్టులను విడుదల చేయకపోవటంతో జిల్లాలోనూ వేలాది మంది ఎదురు చూస్తున్నారు. 16 వేలకు పైగా పోస్టులకు డీఎస్సీ విడుదల చేస్తామని ఆశ చూపిన లోకేష్ ఇతర నాయకులు అవి ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టంగా చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దానికి తోడు జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూప్ –2 పరీక్షలకు హాజరైన 8,792 మంది అభ్యర్థులు సైతం ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు. రోస్టర్ విధానంపై సరైన చర్యలు తీసుకోకుండా పరీక్షలు నిర్వహించటం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
7
న్యూస్‌రీల్
సర్కారు వచ్చి తొమ్మిది
మాసాలైన ఒక్క ఉద్యోగం
ఇవ్వని వైనం
వసతి, విద్యా దీవెనలకు నిధులు నిల్
సర్టిఫికెట్లను ఇవ్వకుండా
వేధిస్తున్న కళాశాలలు
అప్పుల పాలవుతున్న కుటుంబాలు
డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న
వేలాది మంది అభ్యర్థులు
ఉద్యోగాలు లేక, ఎంఎస్‌ఎంఈ
రాక అల్లాడుతున్న యువతరం
యువతకు మద్దతుగా
నేడు వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’
యువతకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు యువత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా విజయవాడలోని కోర్టుల కార్యాలయం నుంచి ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ వినతిపత్రం ఇవ్వటం జరుగుతుంది. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
Comments
Please login to add a commentAdd a comment