పీ4 సర్వేతో ప్రతి ఇంటికి లబ్ధి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (పీ4) సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని కలెక్టర్ డీకేబాలాజీ అన్నారు. ఆయన చాంబర్‌లో కార్యక్రమ వాల్‌పోస్టర్లను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా ముందడుగు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా విలువైన అభిప్రాయాన్ని వెబ్‌సైట్ ద్వారా అందించడానికి ఈ నెల 25వ తేదీ వరకు ప్రజల భాగస్వామ్యం, సంప్రదింపు కాలపరిమితిగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రజల తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ముందుకు రావాలన్నారు. ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారన్నారు. కార్యక్రమంలో జేసీ గీతాంజలిశర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, సీపీవో గణేష్‌కృష్ణ, డీఐపీఆర్వో ఎం. వెంకటేశ్వరప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment