
చికిత్స పొందుతూ యువకుడి మృతి
జి.కొండూరు: బైక్‌పై మేనత్త ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎన్టీఆర్ జిల్లా, వీరులపాడు మండల పరిధి పొన్నవరం గ్రామానికి చెందిన షోడగిరి రాజేష్(24) అదే గ్రామానికి చెందిన షోడగిరి అనిల్‌తో కలిసి బైక్‌పై వెల్లటూరులోని మేనత్త ఇంటికి శనివారం ఉదయం బయలుదేరాడు. వెల్లటూరు శివాలయం మలుపు వద్దకు రాగానే గేదెలు ఆకస్మాత్తుగా రోడ్డు మీదకు రావడంతో బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న ప్రహరీ వైపు పడ్డారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న రాజేష్ తలకు తీవ్రమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెనుక కూర్చున్న అనిల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి తమ్ముడు రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.