
టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం
తిరువూరు: స్థానిక బైపాస్‌రోడ్‌లో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ సుభాని(21) దుర్మరణం చెందాడు. తిరువూరు రాజుపేటకు చెందిన సుభాని బస్టాండు సెంటర్లోని ఒక జ్యూవెలరీ షాపులో పనిచేస్తున్నాడు. దుకాణం నుంచి బయటికి వెళ్లిన యువకుడు తన స్నేహితుడిని ఇంటివద్ద దింపి వస్తుండగా బైపాస్‌రోడ్డులో ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుభాని తల ఛిద్రం కాగా అక్కడికక్కడే మరణించాడు. ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా పనిచేసే సుభాని తండ్రి ఉస్మాన్ ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా ముత్తగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తండ్రి మరణానంతరం సుభానిపైనే కుటుంబం ఆధారపడగా, అతని మరణంతో జీవనాధారం కోల్పోయింది. తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుభాని మృతదేహానికి స్థానిక ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.