
ధాన్యం కొనడం లేదు
నేను 24ఎకరాల్లో దాళ్వా వరి సాగు చేశాను. సార్వా పంట వరద ముంపుతో పోయింది. దాళ్వా బాగా పండింది అంటే కొనే వాళ్లే లేరు. ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పినా ఒక్కరూ తిరిగి చూడడం లేదు. తేమ 17 రావాలని చెబుతున్నారు. ఎండబెట్టి తీసుకెళ్తే మిల్లర్లు ఇంకా ఎండాలని వెనక్కి పంపుతున్నారు. ఇప్పడు వర్షానికి ధాన్యం తడిసిపోతుంది. తీవ్రంగా నష్టపోతున్నాం.
– దారపనేని సాంబశివరావు, కౌలు రైతు, ఈలప్రోలు, ఇబ్రహీంపట్నం మండలం