
హైవేపై సినీఫక్కీలో చైన్‌స్నాచింగ్
హనుమాన్‌జంక్షన్‌రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై ఓ కిలాడీ జంట బైక్‌పై వెళుతూనే సినీఫక్కీలో మరో స్కూటర్‌పై వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసులను చాకచాక్యంగా తెంచుకుని రెప్పపాటులో మాయమయ్యారు. బాపులపాడు మండలంలోని అంపాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఏలూరుకు చెందిన కర్రె పోతురాజు, కనకరత్నం దంపతులు స్కూటర్‌పై గన్నవరం మండలం పురుషోత్తపట్నంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా అంపాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద వెనుకనుంచి వేగంగా బైక్‌పై వచ్చిన ఓ కిలాడీ జంట క్షణాల్లో మహిళ మెడలోని రెండు బంగారు గొలుసులను లాక్కుని పరారయ్యారు. భర్త పోతురాజు స్కూటర్ నడుపుతుండగా వెనుక సీటులో కూర్చున్న కనకరత్నం మెడలోని 32 గ్రాముల విలువైన రెండు బంగారు గొలుసులను దుండగులు బైక్ నడుపుతూనే దొంగిలించటం గమనార్హం. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా వెనుక సీట్‌లో కూర్చున మహిళ చాకచక్యంగా కనకరత్నం మెడలోని బంగారు గొలుసులను లాక్కుంది. ఊహించని ఈ ఘటనతో అవాకై ్కన కనకరత్నం వెంటనే తేరుకుని కేకల వేయటంతో భర్త స్కూటర్ ఆపాడు. ఆ తర్వాత చోరీ జరిగిన విషయాన్ని భార్య చెప్పటంతో దుండగుల బైక్‌ను వెంబడించినప్పటికీ వారు మెరుపువేగంతో పరారయ్యారు. ఈ చోరీపై వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు కనకరత్నం ఫిర్యాదు ఇవ్వగా ఎస్‌ఐ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. ఆత్కూర్ టోల్‌గేట్ సహా హైవేపై పలుచోట్ల సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి, దుండగుల చిత్రాలను సేకరిస్తున్నారు.