2023 మే 3: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కార్యరూపం తీసుకొచ్చేందుకు నడుంబిగించారు. దీనికోసం త్రిముఖ వ్యూహం అనుసరించారు. ఇక్కడ 2,751 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు. మరోవైపు రైతులకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం విషయంలో తన ఉదారతను చాటుతూ వారిని ఒప్పించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేలా చొరవ చూపించారు.
అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను తరచుగా సంప్రదిస్తూ విమానాశ్రయానికి అవసరమైన అనుమతులన్నీ సాధించారు. అలా అడ్డంకులన్నీ అధిగమించడానికి, అనుమతులన్నీ తేవడానికి నాలుగేళ్ల కాలం పట్టింది. ఇక మార్గం సుగమమైన నేపథ్యంలో రానున్న రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేసి, మూడో ఏట పూర్తిస్థాయిలో విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను నిర్వహించాలనేది లక్ష్యం.
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ మరుక్షణమే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు జీఎంఆర్ సిద్ధంగా ఉంది. ఉమ్మడి విజయనగరం జిల్లా సహా ఉత్తరాంధ్ర దశాదిశా మార్చేసే, రాష్ట్రంలో బహుముఖ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దోహదం చేసే భోగాపురం విమానాశ్రయ ఊహాచిత్రం ఇది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల పాలనాకాలంలో చేసిదేమిటో, ఈ నాలుగేళ్లలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సాధించిందేమిటో రికార్డు ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. కనీసం ఏ భూమిలో వేస్తున్నామో చూడకుండా శిలాఫలకం వేసేసి టెంకాయ కొట్టే మ మ అనిపించిన చంద్రబాబుదే ఘనత అంటూ డ బ్బా కొట్టుకోవడం వారికే చెల్లిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుత విశాఖ విమా నాశ్రయాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పు చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో భోగాపురం వద్ద విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన 2015 సంవత్సరంలో తెరపైకి వచ్చింది.
గత టీడీపీ ప్రభుత్వం భూసేకరణకు బీజం వేసింది. 15 వేల ఎకరాలు సేకరిస్తామనడంతో భోగాపురం మండల రైతులు ఆందోళనలకు దిగారు. దీంతో ఐదు వేల ఎకరాలకు దిగొచ్చింది. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ప్రకటించడం, అసైన్డ్ భూములకు విస్మరించడంతో 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. అడ్డదిడ్డంగా తలపెట్టిన భూసేకరణను సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఏమీ పూర్తి చేయలేదు. ఏదిఏమైనా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత తనదేనని చాటుకోవాలని ప్రచారయావతో చంద్రబాబు 2019 ఫిబ్రవరి 14వ తేదీన హడావుడిగా శంకుస్థాపన చేయడం అప్పట్లో విమర్శలకు దారితీసింది.
ఫలించిన జగన్‌మోహన్‌రెడ్డి శ్రమ...
విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ స్థాయి లో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని నిర్ణయించారు. పరిహారా న్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ అందించారు. అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డకొండ అప్పలనాయుడు, భోగాపురం మండల నాయకుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి తదితరు లు జరిపిన చర్చలతో చాలామంది రైతులు సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ పరిష్కరించాయి. నిర్వాసితులైన నాలుగు గ్రామాల్లోని 404 కుటుంబాలకు అత్యుత్తమమైన పునరావాసప్యాకేజీ ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను వారికోసం నిర్మించింది.
అత్యాధునికంగా నిర్మాణం...
దాదాపు రూ.790 కోట్ల ఖర్చుతో సేకరించిన 2,750 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు బదలాయించింది. అందులో విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 2,203 ఎకరాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. రాజాం ప్రాంత వాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావుకు చెందిన జీఎంఆర్ గ్రూప్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment