
రాయగడ: సదరు సమితి పరిధి జేకేపూర్‌లోని పేప ర్ మిల్ కంపెనీ ప్రాంగణంలో జాతీయ భద్రతా వారోత్సవాలు సోమవారం నిర్వహించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా ఫ్యాక్టరీస్ అండ్ బొయిల ర్స్ డిప్యూటీ డైరక్టర్ చిత్తరంజన్ బెవురా పాల్గొని ప్రసంగించారు. కర్మాగారంలో భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ప్రతీ ఏడాది కంపెనీ లో భద్రతపరమైన జాగ్రత్తలను పాటించడంతో పాటు కార్మికులకు అన్నివేళలా చైతన్యపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కర్మాగారం సేప్టీ అధి కారి రాంరంజన్ బిశ్వాల్ తెలియజేశారు. కార్యక్రమంలో జేకే పేపర్ మిల్స్ సీనియర్ జనరల్ మేనే జ ర్ ఎంఆర్‌కే రాయ్, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ జీసీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న చిత్తరంజన్ బెవుర
Comments
Please login to add a commentAdd a comment