
జయపురంలో సత్య సాయి స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం
జయపురం: సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీసత్య సాయి సేవా ఆర్గనైజేషన్ ఒడిశా తరఫున 10 వ స్కిల్ డలప్‌మెంట్ కేంద్రాన్ని జయపురంలో ఆదివారం ప్రారంభించారు. శ్రీసత్య సాయి సేవా ఆర్గనైజేషన్ ఒడిశా అధ్యక్షుడు డాక్టర్ సత్య స్వరూప్ పట్నాయిక్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుళ ఆదివాసీ అవిభక్త కొరాపుట్‌లో విద్య, ఉద్యోగాలకు ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలను గుర్తించి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభకు పదును పెట్టేలా ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ఈ కేంద్రంలో విద్యార్థులకు కంప్యూటర్ విద్యా శిక్షణ, టైలరింగ్ శిక్షణ ఇస్తారన్నారు. మొదటి ఏడాది 18 మందికి కంప్యూటర్ శిక్షణ, 12 మందికి టైలరింగ్ శిక్షణ ఇస్తారని, సోమవారం నుంచి శిక్షణలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీసత్య సాయి సేవా సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు నాగభూషణం, కొరాపుట్ అధ్యక్షుడు మార్కండేయులు, శ్రీసత్య సాయి ట్రస్టు సభ్యలు సునీల్ మహంతి, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

జయపురంలో సత్య సాయి స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment