
సరిహద్దు గ్రామాల్లో చిరుత సంచారం
కొరాపుట్: సరిహద్దు ప్రాంతాల్లో చిరుత పులి సంచారం అందరినీ భయ బ్రాంతులకు గురి చేస్తోంది. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి పక్కనే ఉన్న రాష్ట్ర సరిహద్దు అవతల ఉన్న కాంకేర్ జిల్లా దుదుబా, మకిడి కానా గ్రామాల్లో చిరుత పులి సంచరించింది. సాయంత్రం అయ్యేసరికి గ్రామాల్లోకి వచ్చేస్తోంది. అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో పర్యటిస్తూ పులిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఈ వార్తలు జిల్లాలో సరిహద్దు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
పినాంగి పర్వత అడవిలో అగ్ని ప్రమాదం
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయం వెనుక వైపున ఉన్న పినాంగి రిజర్వ్ ఫారెస్ట్‌లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అటవీ విభాగానికి ఆలస్యంగా సమాచారం అందడంతో వారు వెళ్లి మంటలను ఆర్పారు. ఎవరో ఎండు ఆకులకు అగ్గి పెట్టి ఉంటారని, అందుచేత మంటలు విస్తరించి ఉంటాయని భావిస్తున్నారు.
బెదిరింపు కేసులో
నిందితుడి అరెస్టు
జయపురం: జయపురం సదర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని బెదిరించి రూ.లక్ష డిమాండ్‌చేసిన నిందితుడిని జయపురం సదర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రదాన్ వెల్లడించారు. ఈ నెల 3 వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జయపురం సమితి దుబులి గ్రామ వాసి కింకర్ సర్కార్(28) లిఖిత ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ రాత్రి 8.45 గంటల సమయంలో డొంబుగుడ గ్రామం ఆటోడ్రైవర్ కృష్ణ టక్రి తన ఇంటికి వచ్చి ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేశాడని, ఇవ్వనని చెబితే ఇళ్లు, భూములు ఖాళీ చేసి వెళ్లిపొమ్మని హెచ్చరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కృష్ణ టక్రి కొంత మంది అనుచరులతో కలసి సర్కార్ ఇంటికి వచ్చాడు. కత్తితో చంపుతానని బెదిరించి రూ.5వేలు తీసుకెళ్లిపోయాడని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి కృష్ణ టక్రిని గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచామని తెలిపారు.
బైకు దొంగలు దొరికారు
రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌లో గల పలు ప్రాంతాల్లో చోరీకి గురైన 5 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురుని అరెస్టు చేశారు. అరెస్టయిన వారు 15 ఏళ్ల లొపువారు కావడంతో వారిని భవానీపట్నంలో గల బాలల కారాగారానికి ఆదివారం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శివరాత్రి రోజు బిసంకటక్ సమితిలో గల చాటికొన శైవక్షేత్రంలో శివుని దర్శనం కోసం వెళ్లిన హిమిరిక బైకు దొంగతనానికి గురైంది. దీనికి సంబంధించి బాధితుడు బిసంకటక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తిని రాయగడలో పట్టుకున్నారు. అనంతరం అతనిని బిసంకటక్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా.. బైకు దొంగతనం చేసిన మరో ఇద్దరి వివరాలను పోలీసులకు చెప్పాడు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

సరిహద్దు గ్రామాల్లో చిరుత సంచారం

సరిహద్దు గ్రామాల్లో చిరుత సంచారం
Comments
Please login to add a commentAdd a comment