
మాజీ మంత్రి అనంత దాస్ కన్నుమూత
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా భొగొరాయ్ మాజీ ఎమ్మెల్యే, మంత్రి అనంత దాస్ (85) కన్ను మూశారు. భువనేశ్వర్‌లో తన నివాసంలో ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీర్ఘకాలంగా వయో సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి పలికి 2004 సంవత్సరంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడారు. అది మొదలుకొని వరుసగా నాలుగు పర్యాయాలు బిజూ జనతా దళ్ అభ్యర్థిగా భొగొరాయ్ నియోజక వర్గం నుంచి రాష్ట్ర శాసన సభకు ప్రాతినిథ్యం వహించారు. తొలి సారి 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే, 2009 నుంచి 2014 వరకు శాసన సభ చీఫ్ విప్, 2014 నుంచి 2019 వరకు ఉన్నత విద్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా కీలకమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆయన 2019 నుంచి 2024 వరకు జిల్లా ప్రణాళిక బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంత దాస్ ఆగస్టు 28, 1940న భొగొరాయ్ మండలం కురుఠియాలో జన్మించారు. మరణించే సమయానికి ఆయన వయస్సు 85 ఏళ్లు. అనంత దాస్ మరణంతో తన నియోజక వర్గం భొగొరాయ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మాజీ మంత్రి అనంత దాస్ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment