
మాట్లాడుతున్న రాష్ట్ర అదనపు చీఫ్ ఎన్నికల అధికారి డాక్టర్ తిరుమల నాయక్
రాయగడ: సార్వత్రిక ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర అదనపు చీఫ్ ఎన్నికల అధికారి డాక్టర్ తిరుమల నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం రాయగడ ఆర్‌డీఏ సమావేశం మందిరంలో కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ అధ్యక్షతన ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలనాయక్ మాట్లాడుతూ అత్యధిక శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన ఓటర్లు, దివ్యాంగులు సైతం ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డబ్బు, మాదకద్రవ్యాలు, వ్యాపారాల ద్వారా ప్రజలు ప్రభావితం కాకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. అంతకుముందు స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాలను నాయక్ సందర్శించారు. స్ట్రాంగ్ రూం పరిశీలించారు. సమావేశంలో ఎస్పీ హరీష్ బిసి, సబ్ కలెక్టర్ కళ్యాణి సంఘమిత్రాదేవి, గుణుపూర్ సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి నిహారి రంజన్ కుహరో తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment