
సిరిపురం రెవెన్యూ పరిధిలో సాగునీటి కాలువ కప్పేసి వేసిన రోడ్డు
గంట్యాడ: గతంలోఅధికార మదంతో ఓ టీడీపీనేత రెచ్చిపోయాడు. అధికారం ఉంది కదాని ఏకంగా పోరంబోకు వాగు (సాగునీటి కాలువ)ను కప్పేసి తన సొంత పొలానికి వెళ్లడానికి రోడ్డు వేసేశాడు. దీనిపై అప్పట్లో రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఆ నేత అధికార పార్టీకి చెందిన వాడు అధికారులు మిన్నకుండి పోయారు. టీడీపీ నేత అక్రమంగా రోడ్డు వేయడం వల్ల సాగునీటి కాలువ ద్వారా చెరువులోకి వెళ్లాల్సిన నీరు వెళ్లడం లేదు. టీడీపీ నేత బరితెగించి ప్రభుత్వ సాగునీటి కాలువలో రోడ్డు వేసినప్పటికీ అప్పట్లో రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిరిపురం రెవెన్యూ పరిధిలో ఘటన
గంట్యాడ మండలంలోని సిరిపురం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 108–1 లో సాగునీటి కాలువ ఉంది. ఈ కాలువ గుండా కంసాల చెరువులోకి వర్షాలు పడినప్పడు మెట్టభూముల నుంచి వచ్చే నీరు వెళ్లేది. 2015–16 మధ్య కాలంలో టీడీపీకి చెందిన కీలక నేత ఒకరు ఈ కాలువను కప్పేసి రోడ్డు వేశారు. అక్రమంగా రోడ్డు వేస్తున్నారని, అడ్డుకోవాలని అప్పట్లో రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే రోడ్డు వేసింది ప్రభుత్వ భూమి అయినప్పటికీ అధికారులు చర్య తీసుకోక పోవడం సర్వత్రా చర్చనీయంశమైంది.
టీడీపీ నేత బరితెగింపు
ఫిర్యాదు చేసిన పట్టించుకోని రెవెన్యూ అధికారులు
అధికారుల దృష్టికి తీసుకువెళ్లా
సాగునీటి కాలువపై రోడ్డు వేసిన సమయంలో నేను లేను. పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాను.
శ్రీనివాస్, వీఆర్వో, సిరిపురం
Comments
Please login to add a commentAdd a comment