పలాసలో మృతదేహం కలకలం
కాశీబుగ్గ: పలాస జాతీయ రహదారిని ఆనుకుని కోసంగిపురం చెరువు వద్ద గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. గురువారం అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఈ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే క్లూస్ టీమ్‌తో ఘటనా స్థలానికి చేరుకున్న కాశీబుగ్గ పోలీసులు ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెడలో రుద్రాక్షమాల ప్యాంటు, షర్ట్ ధరించి ఉన్న గుర్తు తెలియని యువకుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇదే ప్రాంతంలో వారం కిందట కూడా మృతదేహం లభ్యమైంది. విద్యుత్ వైర్లు చుట్టేసి అనుమానాస్పదంగా మృతి చెందాడు. రైలు ట్రాక్‌పై వారం రోజుల వ్యవధిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. కారణాలు ఏమైనా ఇటీవల కాలంలో అధికంగా మృతదేహాలు లభ్యంపై స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెదపాడు రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో పాత్రునివలస గ్రామానికి చెందిన బరాటం యుగంధర్ (18) మృతిచెందాడు. స్థానికులు, రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల పెదపాడు పరిధిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రావాడ తాతారావుకు చెందిన ఓ షాపు అడ్డుగా ఉండటంతో దాన్ని వేరే ప్రాంతంలో మార్చేందుకు బుధవారం రాత్రి ప్రొక్లెయిన్‌తో పనులు చేపట్టారు. బడ్డీను తరలించే క్రమంలో హైటెన్షన్ వైర్లు తగలడంతో షార్ట్ సర్క్యూట్ జరగడంతో యుగంధర్ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. ఈయనతో పాటు బరాటం ఉపేంద్ర, రావాడ జగదీష్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రూరల్ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment