ఘనంగా నివాళులు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా నివాళులు

Published Fri, Jan 31 2025 1:32 AM | Last Updated on Fri, Jan 31 2025 1:32 AM

ఘనంగా

ఘనంగా నివాళులు

బీఎస్‌ఎఫ్‌ ప్రజా శిబిరం తులసీ పహాడ్‌లో బీఎస్‌ఎఫ్‌ ప్రజా శిబిరం నిర్వహించారు. గిరిజనులు భారీగా వచ్చారు. –8లోu
శుక్రవారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2025
మహాత్మునికి ..
అవగాహన ర్యాలీ

శ్రీమందిరం ఆదాయం లెక్కింపు

భువనేశ్వర్‌: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం గురువారం లెక్కించారు. ఇందులో నగదు రూ.5,64,604లు, బంగారం 150 మిల్లీగ్రాములు, వచ్చాయని అధికారులు తెలిపారు.

శ్రమదానంతో రోడ్డు నిర్మాణం

పర్లాకిమిడి: స్థానిక బోయవీధి కొండ మీద శ్రీవీరాంజనేయ స్వామి మందిరానికి చేరుకోవడానికి కొందరు ఆంజనేయ భక్తులు, యువకులు శ్రమదానం చేశారు. ఈ శ్రమదానంలో వీరాంజనేయ కమిటీ సభ్యులు, వాకర్స్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఆస్పత్రుల్లో అగ్ని మాపక వ్యవస్థపై ఆరా

భువనేశ్వర్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లో అగ్ని మాపక వ్యవస్థపై రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం దృష్టి సారించింది. ఈ మేరకు అందుబాటులో ఉన్న అగ్నిమాపక భద్రత వ్యవస్థ ఆడిట్‌ నివేదికలను దాఖలు చేయాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశించింది. ఈ ప్రక్రియ కోసం 4 నెలలు గడువు కల్పించింది. ఈ వ్యవధిలోగా ఆడిట్‌ నివేదిక దాఖలు చేయాలని రాష్ట్ర అగ్ని మాపక సేవలు, హోం గార్‌ుడ్స, సివిల్‌ డిఫెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాపడాలోని ఓ ఆస్పత్రిలో అగ్ని మాపక వ్యవస్థకు సంబంధించి దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎస్‌కే పాణిగ్రహి ఏక సభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో అగ్ని మాపక వ్యవస్థ స్థితిగతులకు సంబంధించి సవివరమైన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని అనుబంధ వర్గాల ఉన్నతాధికారులకు ఉన్నత న్యాయ స్థానం ఆదేశించింది. ఆదేశాల జారీ నుంచి 4 నెలల వ్యవధిలో సవివరంగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం పేర్కొంది.

అడ్వైజరీ కమిటీలో

జయపురం వాసులు

జయపురం: జయపురం ఎయిర్‌ ఫోర్టు అడ్వైజరీ కమిటీ సభ్యులుగా జయపురం పట్టణానికి చెందిన ఐదుగురు వ్యక్తులను నామినేట్‌ చేశారు. జయపురం చాంబర్‌ ఆఫ్‌ కామర్ష్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ అధ్యక్షుడు వి.ప్రభాకర్‌, హలో జయపూర్‌, సినీప్లెక్స్‌ యజమాని అలోక్‌ అగర్వాలా, ట్రావెల్‌ ఏజన్సీ యజమాని బాలకృష్ణ పాడీ, ప్రముఖ కళాకారుడు దిరెన్‌ మోహన్‌ పట్నాయక్‌, సమాజ సేవకుడు దుర్గాశంకర సాహును నామినేట్‌ చేసినట్లు కోరాపుట్‌ ఎంపీ, రూరల్‌ డవలప్‌మెంట్‌ , పంచాయతీ రాజ్‌ చైర్మన్‌ సప్తగిరి శంకర ఉల్క తెలిపారు.

భువనేశ్వర్‌: అమరవీరుల దినం సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాసన సభ ఆవరణలో బాపూజీ విగ్రహానికి పూలమాలలతో అలంకరించి ప్రత్యేక నివాళి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి, శాసనసభ స్పీకర్‌ సురమా పాఢి, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీతో పాటు ఉప ముఖ్యమంత్రులు కనక వర్ధన్‌ సింగ్‌దేవ్‌, ప్రభాతి పరిడా, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు హాజరయ్యారు. వీరంతా బాపూజీ విగ్రహం దగ్గర పుష్పాంజలి ఘటించారు.

పర్లాకిమిడిలో..

పర్లాకిమిడి: మహాత్మాగాంధీ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక కలెక్టరేట్‌లో అధికారులు, సిబ్బంది ఐదు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ రాజేంద్ర మింజ్‌, డిప్యూటీ కలెక్టర్‌ కమలకాంత పండా, డిప్యూటీ కలెక్టర్లు లిపినాదాస్‌, కశ్యప్‌ బెహరా, మనోజ్‌ కుమార్‌ పట్నాయిక్‌, మినిస్టీరియల్‌ సిబ్బంది ఉన్నారు.

రాయగడలో..

రాయగడ: సహీద్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కలెక్టర్‌ కార్యాలయం ప్రాంగణంలో గురువారం అమర వీరులకు నివాళులు అర్పించారు. కలెక్టర్‌ ఫరూల్‌ పట్వారి, ఏడీఎం నిహారి రంజన్‌ కుహొరొ, సబ్‌ కలెక్టర్‌ కల్యాణి సంఘమిత్రాదేవి, ఉద్యోగులు సిబ్బంది మహాత్ముని చిత్రపటానికి పూటమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

మల్కన్‌గిరిలో..

మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలోని డైలీ మార్కెట్‌ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గురువారం జిల్లా కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ గోవింధ పాత్రో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు జి.శ్రీనివాసరావు, పి.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని గాంధీ జంక్షన్‌లో గాంధీ విగ్రహానికి డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు సిరాజ్‌ అహ్మద్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ వి.కీర్తి వాసన్‌ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, గాంధీ విగ్రహాల వద్ద సంతాప సభలు జరిగాయి.

భువనేశ్వర్‌: బాపూజీకి పుష్పాంజలి ఘటించిన రాష్ట్ర గవర్నర్‌ డాక్టరు హరి బాబు కంభంపాటి

మహా కుంభమేళా ప్రత్యేక బస్సు సేవలు తాత్కాలికంగా నిలిపివేత

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్‌ఆర్టీసీ) మహా కుంభ మేళాకు ప్రత్యేక బస్సు సేవలు ప్రవేశ పెట్టింది. తొలి దశలో ఈ నెల 12 నుంచి ప్రయాగ్‌రాజ్‌కు 8 ప్రత్యేక బస్సులను ప్రవేశ పెట్టారు. ఫిబ్రవరి నెల 26 వరకు ఈ సేవలు కొనసాగుతాయని ప్రకటించారు. మహా కుంభ మేళాలో ఇటీవల చోటు చేసుకున్న అనూహ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఓఎస్‌ఆర్టీసీ గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4 వరకు మ హా కుంభ మేళా ప్రత్యేక బస్సు సేవలు రద్దు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవధిలో మహా కుంభ మేళాకు ప్రయాణాన్ని ఇప్పటికే బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు ఓఎస్‌ఆర్టీసీ అవసరమైన చోట అనుకూల సహాయం అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది. సేవల రద్దు నేపథ్యంలో టికెట్‌ చార్జీ ఫిరాయింపులకు ఓఎస్‌ఆర్టీసీ హామీ ఇచ్చింది. సంప్రదింపుల కోసం మొబైల్‌ నంబర్‌ 9937547773 ను ఏర్పాటు చేశారు.

రాయగడ: సదరు సమితి తడమ పంచాయతీలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవుల సంరక్షణపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ పరిధి గోపాల్‌పూర్‌ నుంచి తడమ గ్రామం వరకు ర్యాలీ కొనసాగింది. అటవీ శాఖ రేంజర్‌ కామేశ్వర్‌ ఆచాచి, తడమ పాఠశాల హెచ్‌ఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

జీరో వేస్ట్‌ స్కూల్‌ కార్యక్రమం ప్రారంభించిన నగర మేయరు సులోచన దాస్‌

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ఘనంగా నివాళులు 1
1/11

ఘనంగా నివాళులు

ఘనంగా నివాళులు 2
2/11

ఘనంగా నివాళులు

ఘనంగా నివాళులు 3
3/11

ఘనంగా నివాళులు

ఘనంగా నివాళులు 4
4/11

ఘనంగా నివాళులు

ఘనంగా నివాళులు 5
5/11

ఘనంగా నివాళులు

ఘనంగా నివాళులు 6
6/11

ఘనంగా నివాళులు

ఘనంగా నివాళులు 7
7/11

ఘనంగా నివాళులు

ఘనంగా నివాళులు 8
8/11

ఘనంగా నివాళులు

ఘనంగా నివాళులు 9
9/11

ఘనంగా నివాళులు

ఘనంగా నివాళులు 10
10/11

ఘనంగా నివాళులు

ఘనంగా నివాళులు 11
11/11

ఘనంగా నివాళులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement