తాగునీటి ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపం
రాయగడ: పట్టణ ప్రజలకు తాగునీటి సౌకర్యార్ధం నిర్మిస్తున్న మెగా తాగునీటి ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపిస్తోందని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక ఆరోపించారు. స్థానిక ఓఎంపీ ప్రాంతంలో ప్రాజెక్టు పనుల్లో భాగంగా కొత్తగా నిర్మించిన భారీ తాగునీటి ట్యాంకర్ నుంచి నీరు చిమ్ముతోందని, అదేవిధంగా ఇప్పటికే పగుళ్లు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సంబంధిత శాఖ ఇంజినీర్ సహదేవ్ కిషాన్ను ట్యాంకర్ వద్దకు పిలిచి ఆయనపై మండిపడ్డారు. నిర్మాణం పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని అవసరమైతే సంబంధిత శాఖ మంత్రి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానని హెచ్చరించారు. తక్షణమే తగు చర్యలు తీసుకుని పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment