ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం కావాలి
పర్లాకిమిడి: మెరుగైన ఆరోగ్యమే అందరి లక్ష్యం కావాలని వక్తలు అన్నార. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక కలెక్టరేట్ హాల్–2లో జిల్లా యంత్రాంగం, వివిధ స్వచ్ఛంద సంస్థలతో చైతన్య కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటుచేశారు. జిల్లా శిశు సంక్షేమ సమితి చైర్మన్ అశ్వినీ కుమార్ మహాపాత్రో, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారిని మినాతి దేవి, జిల్లా శిశు సంరక్షణ అధికారి (డీసీపీయూ) అరుణ్ కుమార్ త్రిపాఠి, సురక్షా అధికారి సరలా పాత్రో తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మానసిక మహిళా రోగులు, మైనర్ బాలికలు, నవజాత శిశువుల సంరక్షణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డీసీపీయూ అరుణ్ కుమార్ త్రిపాఠి వివరించారు. మానసిక వైజ్ఞానికులు డాక్టర్ ప్రదీప్ కుమార్ పాత్రో, మానసిక ఆరోగ్యం కార్యకర్తలు ప్రాణరంజన్ నాయక్, ప్రత్యూష్ పండా, ఒన్ స్టాప్ సెంటర్, చైల్డ్‌లైన్, శక్తిసాధన కార్యకర్తలు, వృద్ధాశ్రమం స్వచ్ఛంద సేవకులు, యాక్షన్ ఎయిడ్, అరుణ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం కావాలి
Comments
Please login to add a commentAdd a comment