విద్యార్థులను తీర్చిదిద్దుతున్న శిశు విద్యాలయాలు
జయపురం: సరస్వతీ శిశు మందిర విద్యాలయాలు విద్యార్థులను ఉత్తమ చరితులుగా తీర్చి దిద్దుతున్నాయని జాగృతీ మండల్ ట్రస్టు రాయిపూర్ అధ్యక్షులు కువార్ రాజా బహుదూర్ సింగ్ రాణా ప్రశంసించారు. శుక్రవారం సాయంత్రం జయపురం సబ్‌డివిజన్ కోట్‌పాడ్ సరస్వతీ శిశు విద్యామందిర వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. పాఠశాలలు విద్యార్థులను ప్రతిభవంతులుగా తీర్చిదిద్దే ఖార్కానాలు కావాలన్నారు. కొరాపుట్ కేంద్ర విశ్వవిద్యాలయ అధ్యాపకులు డాక్టర్ సీతానాథ్ రాయగురు గౌరవఅతిథిగా పాల్గొన్నారు. సరస్వతీ శిశుమందిర విద్యాలయ పరిశీలన కమిటీ అధ్యక్షులు గౌరీ ప్రసాద్ రౌత్ అధ్యక్షతన జరిగిన కార్యిక్రమంలో భాగంగా వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన పిల్లలకు ముఖ్యఅతిథి రాజా బహుదూర్ సింగ్ ఠానా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సరస్వతీ శిశుమందిర పాఠశాల గురు, గురుమాలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment