వర్సిటీకి చేరిన +2 పరీక్ష పత్రాలు
జయపురం: ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభంకానున్న +2 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు విక్రమదేవ్ విశ్వద్యాలయానికి చేరాయి. 3,400 మంది +2 పరీక్షలు రాయనున్నట్లు విక్రమదేవ్ హయ్యర్ సెకండరీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ పాత్రో శనివారం తెలియజేశారు. ఈసారి సైన్స్, ఆర్ట్స్, కామర్స్, వొకేషనల్ విభాగాల్లో వీరంతా పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. విక్రమదేవ్ విశ్వద్యాలయ పరిధిలో విక్రమదేవ్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ మహిళా సెకండరీ కళాశాల, శ్రీవిక్రమార్ట్స్ అండ్ క్రాఫ్ట్స కళాశాల, కుంధ్రా బిజూ పట్నాయక్ కాశాశాల, లమతాపుట్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జూనియర్ కళాశాల, కాకలపడ హయ్యర్ సెకండరీ పాఠశాల, బొయిపరిగుడ సహిద్ లక్ష్మణ నాయిక్ జూనియర్ కళాశాల, బముణిపుట్ ఎస్.ఎస్.డి. ఉన్నత పాఠశాల కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. మార్చి 27వ తేదీతో పరీక్షలు ముగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment