విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో ఈనెల 23న ఉత్తరాంధ్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కేవీ.జ్వాలాముఖి బుధవారం తెలిపారు. ఈ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకా రులతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం–మన్యం, అనకాపల్లి జిల్లాలకు చెందిన వారు పాల్గొంటారని పేర్కొన్నారు. ఓపెన్ విభాగంతో పాటు అండర్–7,9,11,13,15 వయస్సుల విభాగాల్లోని బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ఓపెన్ విభాగంలో విజేతకు రూ.30వేల నగదు బహుమతి ప్రదానం చేయనుండగా..చిన్నారుల విభాగంలో విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ముందుగా ఫోన్ 9703344488 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment