నిందితుడు అరెస్టు
జయపురం: ఒక బాలికపై లైంగిక దాడి ఆరోపణల తో జయపురం మహిళా పోలీసులు ఒక యువకుడిని అరెస్టు చేశారు. జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ డాబుగుడ గ్రామానికి చెందిన లక్ష్మణ గౌఢ(18)ని అరెస్టు చేశామని మహిళా పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ ఈశ్వర తండి బుధవారం వెల్లడించారు. ఈనెల 13వ తేదీ రాత్రి బాలిక బహిర్భూమి కోసం బయటకు వెళ్లగా.. అక్కడే ఉన్న లక్ష్మణ గౌడ బాలికను ఎత్తుకుపోయి అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం ఎవరికి తెలిపినా చంపుతానని బాలికను హెచ్చరించాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడిని పట్టుకుని దేహ శుద్ధి చేశారు. మరుసటి రోజు యువకుడి గ్రామానికి చెందిన వారు కర్రలు, గొడ్డళ్లు పట్టుకుని బాధితురాలి గ్రామంపై దాడి చేసి లక్ష్మణ గౌడను విడిపించుకుని వెళ్లిపోయారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసుల ను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశా రు. బాలికను ఆస్పత్రిలో పరీక్షించి ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అనంతరం నిందితుడు లక్ష్మణ గౌడను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment