భారీగా గంజాయి స్వాధీనం
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి మావోయిస్టు నక్సల్ ప్రభావిత ప్రాంతం జి.మఝిగుడ గ్రామ పంచాయతీ కొటరగుడ సమీప అడవిలో 578 కేజీల గంజాయిని కనుగొన్నట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ బుధవారం వెల్లడించారు. మంగళవారం కొటరగుడ అడవిలో 25 బస్తాలు ఒక చోట పేర్చి ఉండటాన్ని గుర్తించిన్నట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళీ ప్రదాన్ తెలిపారు. గంజాయి బస్తాలను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి మెజిస్ట్రేట్ సమక్షంలో తూకం వేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
రాయగడ జిల్లాలో..
జిల్లాలోని గుణుపూర్, పద్మపూర్ ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు నిర్వహించిన దాడుల్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కుర్లిం ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు కుర్లిం రహదారి వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు బోలేరోను ఆపి తనిఖీ చేయగా అందులో 630 కిలోల గంజాయి పట్టుబడింది. పట్టుబడిన వ్యక్తి గజపతి జిల్లాలోని బిరికొట్ ప్రాంతానికి చెందిన జయంత్ బెహరాగా పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10 లక్షల ఉంటుందని అంచనా వేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని బుధవారం కోర్టుకు తరలించారు.
పద్మపూర్‌లో..
పద్మపూర్‌లో బుధవారం నిర్వహించిన దాడుల్లో భాగంగా బడపల్లి అటవీ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. 40 కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు రాకను పసిగట్టిన గంజాయి అక్రమ రవాణా దారులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
భారీగా గంజాయి స్వాధీనం
భారీగా గంజాయి స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment