బీజేపీ జిల్లా అధ్యక్షునికి ఘన స్వాగతం
రాయగడ: బీజేపీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన న్యాయవాది ఎం.గోపి ఆనంద్‌కు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అధ్యక్షునిగా నియమితులైన గోపి పూరి జగన్నాథుని దర్శించుకుని మంగళవారం సాయంత్రం తిరిగి రాయగడకు వస్తున్న సమయంలో రామనగుడ, గుమడ,అమలా భట్ట ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘ నంగా స్వాగతం పలికారు. అనంతరం రాయగడకు చేరుకున్న ఆయనకు స్థానిక సర్క్యూట్ హౌస్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు, కార్య కర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి ఆనందం పంచుకున్నారు.
బర్డ్ ఫ్లూ భయం లేదు
రాయగడ: జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం లేదని జిల్లా ముఖ్య పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ దేవరాజ్ నాయక్ స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాపించదన్న వదంతులు రావడంతో జిల్లాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పా టు చేశామన్నారు. ఆంధ్రా నుంచి అత్యధిక శాతం బాయిలర్ కోళ్లు దిగుమతి అవుతున్నా యని, దీంతో అప్రమత్తమై ప్రతీ పౌల్ట్రీలో కోళ్ల ను పరీక్షిస్తున్నామని తెలిపారు. ఇంతవరకు అలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదని చెప్పారు. అయితే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, అధిక శాతం బాయిలర్ చికెన్‌ని వినియోగించకపోవడమే మంచిదని అన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాపించిందన్న వచ్చిన వదంతులతో స్థానిక చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి.
ధాన్యం లోడ్‌తో ట్రాక్టర్ బోల్తా
మల్కన్‌గిరి: జిల్లా కలిమెల సమితి బేజాంగ్‌వాడ పంచాయతీ ఎంపివి 71 గ్రామం ముఖ్య రహదారిలో బుధవారం ధాన్యం లోడుతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ రహదారిపై రోజు వందాలాది మంది గిరిజనులు నిత్యావాసరాలకు వస్తుంటారు వంతెన పాడవడంతో 5 కిలో మీటర్లు దూరం చుట్టూ తిరిగి వెళ్లాలి. పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు
ఉగాది పురస్కారాల కవితా
సంపుటాలకు ఆహ్వానం
శ్రీకాకుళం కల్చరల్: వేమన కవితా నిలయం(శ్రీకాకుళం), తపస్వి మనోహరం (హైదరాబాద్) సంయుక్త నిర్వహణలో ఉగాది సందర్భంగా సాహితీ పురస్కార సభ ఏర్పాటు చేస్తున్నట్లు మహ్మద్ రఫీ, తపస్వీ మనోహరం అధినేత నిమ్మగడ్డ కార్తీక్, బుర్రి కుమారరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విశ్వావసు నామ ఉగాది సందర్భంగా మార్చి 23న జరిగే ఈ సభ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు 2023 ఏడాదిలో ముద్రణ జరిగిన కవితా సంపుటి రెండు ప్రతులను మార్చి 15లోగా పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న మూడు పుస్తకాలకు రూ.2వేలు చొప్పున మొత్తం రూ.6వేలు నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. సభకు హాజరైన వారికి సత్కారం ఉంటుందని పేర్కొన్నారు. కవితా సంపుటాలను పోస్టు లేదా కొరియర్ ద్వారా మహ్మద్ రఫీ (ఈవేమన), ఎస్–1 శారదా అపార్టుమెంట్, లక్ష్మీనగర్, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా 532407 చిరునామాకు పంపించాలని కోరారు.
బీజేపీ జిల్లా అధ్యక్షునికి ఘన స్వాగతం
బీజేపీ జిల్లా అధ్యక్షునికి ఘన స్వాగతం
Comments
Please login to add a commentAdd a comment