కొఠియాలో కమ్యూనిస్టు నాయకుల పర్యటన
కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కమ్యూనిస్టు నాయకులు పర్యటించారు. బుధవారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీ దిగువ శెంబి, ఎగువ శెంబి, ధూళి భద్ర గ్రామాల్లో మన్యం పార్వతీపురం జిల్లా సాలూరు మండలం సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో పర్యటనలు జరిగాయి. ఈ పర్యటనలో సీపీఎం జిల్లా కార్యదర్శి గంగ నా యుడు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ సమస్య పరిష్కారం చేయడంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలం అయ్యాయన్నారు. ఈ సమస్య పై ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చొరవ తీసుకొని ఇరు రాష్ట్రాల మధ్య సమావేశం నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలన్నా రు. ఇరు రాష్ట్రాలు ఇక్కడ అభివృద్ధిలో పొటీ పడాలే గానీ గిరిజనులను ఇబ్బంది పెట్టకూడదని తెలిపా రు. పర్యటనలో ఆ పార్టీ నాయకులు ఎన్‌వై నాయు డు, కోరాడ ఈశ్వర రావు, మర్రి శ్రీనివాసరావు, తాడంగి సన్నం, సీతయ్య కొంబులు, చోడిపల్లి బీరుసు, చరణ్ మర్రి మహేష్, కునేటి సుబ్బా తదితరులు పాల్గొన్నారు.
కొఠియాలో కమ్యూనిస్టు నాయకుల పర్యటన
Comments
Please login to add a commentAdd a comment