బాల్య వివాహం నిలిపివేత
కొరాపుట్: జిల్లాలోని సిమిలిగుడ పంచాయతీ మాలిమారువ గ్రామంలో అధికారులు బుధవారం ఓ వివాహ వేడుక జరుగుతోంది. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. భారీ విందు భోజనాలు జరుగుతున్నాయి. కొన్ని క్షణాల్లో పెళ్లి జరగనుంది. సరిగ్గా అదే సమయంలో కొరాపుట్ జిల్లా బాలల సంరక్షణ అధికారిణి రాజశ్రీ దాస్ అక్కడకు పోలీసులతో వెళ్లారు. జరుగుతున్నది బాల్య వివాహమని ఫిర్యాదు రావడంతో.. బాలిక వయసు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి పెళ్లి ఆపాలని సూచించారు. దీంతో గిరిజనులు అధికారుల వాహనాలను చుట్టుముట్టారు. వారిని నచ్చజెప్పి ఇరువర్గాలను కొరాపుట్ తరలించారు. అనంతరం బాలికని శిశు సంక్షేమ వసతి గృహానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment