మహర్దశ
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
పర్లాకిమిడి రైల్వేస్టేషన్‌కు..
● అమృత్‌స్టేషన్ల నవీకరణలో భాగంగా
అభివృద్ధి పనులు
● శరవేగంగా పనుల నిర్వహణ
పర్లాకిమిడి:
అమృత్ స్టేషన్ల నవీకరణలో భాగంగా పర్లాకిమిడి రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టింది. నౌపడ నుంచి పర్లాకిమిడి, గుణుపురం వరకు డబుల్ లైన్స్ వేయడమే కాకుండా పర్లాకిమిడి, గుణుపురం రైల్వేస్టేషన్లను అత్యంత సుందరంగా ఆధునికీకరిస్తున్నారు. మరికోద్ది రోజుల్లోనే స్టేషన్ పనులు పూర్తికానున్నాయి. ప్రస్తుతం పర్లాకిమిడి స్టేషన్‌లో ఓవర్ బ్రిడ్జిపనులు చురుగ్గా సాగుతున్నాయి. సీనియర్ సిటిజన్ ప్యాసింజర్లు ప్లాట్‌ఫారం మారడానికి లిఫ్టు సౌకర్యం సైతం కల్పిస్తున్నారు. రైల్వేస్టేషన్ వద్ద రోడ్డు పనులు సైతం శరవేగంతో పూర్తి చేస్తున్నారు. ఇక్కడ రైల్వేస్టేషన్ ఘనత పర్లాకిమిడి మహారాజా శ్రీకృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్‌కు దక్కుతుంది. నౌపడ నుంచి పర్లాకిమిడికి 91 కిలోమీటర్ల నేరో గేజ్‌పై స్టీమ్ ఇంజనును అప్పట్లో రూ.96 లక్షల సొంత నిధులు వెచ్చించి వెచ్చించి రైళ్ల రాకపోకలకు శ్రీకారం చుట్టారు. తదనంతరం పర్లాకిమిడి నుంచి గుణుపురం వరకు రైల్వేలైన్ పొడిగించారు. ప్రస్తుతం పర్లాకిమిడి నుంచి గుణుపురం అక్కడి నుంచి పూరీ, భువనేశ్వర్, రూర్కెలా, విశాఖపట్నం వరకు మూడు రైళ్లు నడుస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తున్న తరుణంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే నవీకరణకు నడుంబిగించారు. ఒడిషాలో రైల్వేస్టేషన్లు, ట్రాక్స్ ఆధునీకరణకు 2025–26 రైల్వే బడ్జెట్‌లో రూ.10,599 కోట్ల నిధులు కేటాయించారు. గత పదేళ్లలో 2వేల 46 కిలో మీటర్ల రైల్వే ట్రాక్స్ నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలో 59 రైల్వేస్టేషన్లను అమృత్‌స్టేషన్ల పథకం క్రింద అభివృద్ధి చేస్తున్నారు.
న్యూస్‌రీల్
మహర్దశ
మహర్దశ
Comments
Please login to add a commentAdd a comment