దారి దొంగల అరెస్ట్
కొరాపుట్: దారి దోపిడీ దొంగలను నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం ఐఐసీ సంబిత్ బెహరా ఈ కేసు వివరాలు ప్రకటించారు. ఈ నెల 16వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో నందాహండి సమితి గరుడ గుడ గ్రామానికి చెందిన త్రినాథ్ బొత్ర నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో దసరాపొద మార్గంలో జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు దాడి చేసి డబ్బులు, మొబైల్, బైక్ తీసుకెళ్లిపోయారు. బాధితుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితులు సరాపొదకి చెందిన సిద్దు హరిజన్, టింకు హరిజన్, లోహరా శాలకి చెందిన హుస్సేన్ హరిజన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
బోడజాత్రకు ఏర్పాట్లు
మల్కన్‌గిరి: జిల్లాలో ప్రసిద్ధ బోడ జాత్ర నెల రోజుల పాటు సాగనుంది. గిరిజన సంప్రదాయంలో ముత్యాలమ్మ తల్లితో కలిసి శ్రీకృష్ణుడు కనం రాజుగా, అర్జునుడు బాలరాజ్‌గా, భీముడు పోతురాజ్‌గా అమ్మవారితో ఊరేగి ప్రజలకు నెమలి పింఛాలతో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు సౌకర్యాల ఏర్పాటుపై ఒడిశా–ఆంధ్రా అధికారులు సంయుక్తంగా సమావేశమయ్యారు. మార్చి 3న ఆంధ్రాలోని పొల్లేరు గ్రామం నుంచి నదీ స్నానం అనంతరం దేవతలు నౌకా విహారంతో ఒడిశాకు వస్తారు. ఆంధ్రా, ఒడిశా, చత్తీస్‌గఢ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా భక్తులు వస్తుంటారు.
దారి దొంగల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment